Indian Temples List provides all temple history, rich cultural heritage, and travel tips for visitors. Check Stotram and PDF hymns at one place.

About M. S. Rama Rao: Moparthi Sita Rama Rao, popularly known as M. S. Rama Rao (3 July 1921 – 20 April 1992) was a eminent Indian singer an...

MS Rama Rao Sundarakanda Part 1

About M. S. Rama Rao:


Moparthi Sita Rama Rao, popularly known as M. S. Rama Rao (3 July 1921 – 20 April 1992) was a eminent Indian singer and composer. He was the first ever Telugu playback singer and is very famous for his spiritual and devotional songs.

MS Ramarao_Sundarakanda_Part1

He is best known for his Telugu version of Hanuman Chalisa. He also recited Bala Kanda, Ayodhya Kanda and Sundara Kanda (some parts of the famous epic Ramayana) in the form of songs in Telugu. He gained fame for singing religious songs and was given the title "Sundara Dasu" in 1977.

Popular works of Shri M. S. Ramarao:


1. Sundarakandamu
2. Hanuman Chalisa
3. Bala Kandamu

Telugu Akashvani (All India Radio) and Doordarshan broadcasted M. S. Ramarao Sundarakanda's programme almost daily in the morning for about 19 weeks.

Sundara Kanda


In the Valmiki Ramayana, Sundara Kanda is the fifth section. One who worships Lord Hanuman will achieve victory and success in all worthy endeavors.
Lord Hanuman ji idol
It is the only Kanda in Valmiki Ramayana for which Sage Valmiki Maharshi gives a Phala Stuthi.

Now Listen MS Rama Rao Sundarakanda Part 1

సుందరదాసు సుందరకాండ పార్ట్ 1

శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ
నే పలికెద సీతారామ కథ .

శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు
అతి బలవంతుడు రామభక్తుడు
లంకకు పోయి రాగల ధీరుడు
మహిమోపేతుడు శత్రుకర్శనుడు.

జాంబవదాది వీరులందరును
ప్రేరేపింపగ సమ్మతించెను
లంకేశ్వరుడు అపహరించిన
జానకీమాత జాడ తెలిసికొన .

తన తండ్రి అయిన వాయుదేవునకు
సూర్య చంద్ర బ్రహ్మది దేవులకు
వానరేంద్రుడు మహేంద్రగిరి పై
వందనములిడె పూర్వాభిముఖుడై.

రామనామమున పరవశుడయ్యె
రోమరోమమున పులకితుడయ్యె
కాయము పెంచె కుప్పించి యెగసె
దక్షిణ దిశగా లంక చేరగా.

పవనతనయుని పదఘట్టనకే
పర్వతరాజము గజగజ వొణకె
ఫలపుష్పాదులు జలజల రాలె
పరిమళాలు గిరిశిఖరాలు నిండె.

పగిలిన శిలలా ధాతువులెగసె
రత్నకాంతులు నలుదెసల మెరసె
గుహలను దాగిన భూతములదిరి
దీనా రవముల పరుగిడె బెదిరి.  ॥ శ్రీ హనుమాను ||

రఘుకులోత్తముని రామచంద్రుని
పురుషోత్తముని పావన చరితుని
నమ్మిన బంటుని అనిలాత్మజుని
శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని.

నీ కడ కొంత విశ్రాంతి తీసికొని
పూజలందుకొని పోవచ్చునని
సగర ప్రవర్ధితుడు సాగరుడెంతో
ముదమున పలికె మైనాకునితో.

మైనాకుడు ఉన్నతుడై నిలిచె
హనుమంతుడు ఆగ్రహమున గాంచె
ఇదియొక విఘ్నము కాబోలునని
వారిధి పడత్రోసె ఉరముచే గిరిని.

పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగె
పవనతనయుని బలము గని పొంగె
తిరిగి నిలిచె హనుమంతుని పిలిచె
తన శిఖరముపై నరుని రూపమై. ॥ శ్రీ హనుమాను ॥

వానరోత్తమా ఒకసారి నిలుమా
నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా
కందమూలములు ఫలములు తినుమా
నా పూజలు గొని మన్ననలందుమా.

శత యోజనముల పరిమితముగల
జలనిధినవలీల దాటిపోగల
నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు
నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు.

పర్వతోత్తముని కరమున నిమిరి
పవనతనయుడు పలికెను ప్రీతిని
ఓ గిరీంద్రమా సంతసించితిని
నీ సత్కారము ప్రీతినందితిని.

రామకార్యమై యేగుచుంటిని
సాధించువరకు ఆగనంటిని
నే పోవలె క్షణమెంతో విలువలె
నీ దీవనలే నాకు బలములె. ॥ శ్రీ హనుమాను ॥

అనాయాసముగ అంబరవీధిని
పయనము జేసెడు పవనకుమారుని
ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు
పులకాంకితులై ప్రస్తుతించిరి.

రామకార్యమతి సాహసమ్మని
రాక్షసబలమతి భయంకరమని
కపివరుడెంతటి ఘనతరుడోయని
పరిశీలనగా పంపిరి సురసను.

ఎపుడో నన్ను నిన్ను మ్రింగమని
వరమొసగి మరీ బ్రహ్మ పంపెనని
అతిగా సురస నోటిని దెరచె
హనుమంతుడలిగి కాయము పెంచె.

ఒకరినొకరు మించి కాయము పెంచిరి
శత యోజనములు విస్తరించిరి
పైనుండి సురలు తహతహలాడిరి
ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి.

సురస ముఖము విశాలమౌట గని
సూక్ష్మబుద్ధి గొని సమయమిదేనని
క్షణములోన అంగుష్ఠమాతృడై
ముఖము చొచ్చి వెలివచ్చె విజయుడై.

పవనకుమారుని సాహసము గని
దీవించె సురస నిజ రూపము గొని
నీలాలంబ నీలాంబరము గనుచు
మారుతి సాగెను వేగము పెంచుచు.

జలనిధి తేలే మారుతి ఛాయను
రాక్షసి సింహిక అట్టె గ్రహించెను
గుహను బోలు తన నోటిని తెరచెను
కపివరుని గుంజి మ్రింగజూచెను.

అంతట మారుతి సూక్ష్మరూపమున
సింహిక ముఖమును చొచ్చి చీల్చెను
సింహిక హృదయము చీలికలాయెను
సాగరమున బడి అసువులు బాసెను.

వారిథి దాటెను వాయుకుమారుడు
లంక జేరెను కార్యశూరుడు
నలువంకలను కలయజూచుచు
నిజ రూపమున మెల్లగ సాగుచు.

త్రికూటాచల శిఖరము పైన
విశ్వకర్మ వినిర్మితమైన
స్వర్గపురముతో సమానమైన
లంకాపురమును మారుతి గాంచెను. ॥ శ్రీ హనుమాను ॥

Upcoming: Sundara Dasu MS Rama Rao Sundarakanda Part 2

0 Comments: