Indian Temples List provides all temple history, rich cultural heritage, and travel tips for visitors. Check Stotram and PDF hymns at one place.

Sundara Kanda is special because it is the only part of the Valmiki Ramayana where Sage Valmiki explains the good results (Phala Stuthi) of...

MS Rama Rao Sundarakanda Part 2

Sundara Kanda is special because it is the only part of the Valmiki Ramayana where Sage Valmiki explains the good results (Phala Stuthi) of reading it. 📖🙏


MS Ramarao_Sundarakanda_Part2

Now Listen MS Rama Rao Sundarakanda Part 2 dedicated to Lord Hanuman:


సుందరదాసు సుందరకాండ పార్ట్ 2

అనిలకుమారుడా రాత్రివేళను
సూక్ష్మరూపుడై బయలుదేరెను
రజనీకరుని వెలుగున తాను
రజనీచరుల కనులబడకను.

పిల్లివలె పొంచి మెల్లగ సాగెను
ఉత్తర ప్రాకార ద్వారము జేరెను
లంకారాక్షసి కపివరు గాంచెను
గర్జన సేయుచు అడ్డగించెను.

కొండ కోనల తిరుగాడు కోతివి
ఈ పురికి యే పనికై వచ్చితివి
లంకేశ్వరుని ఆనతి మేర
లంకాపురికి కావలి యున్నా.

లంకను నేను లంకాధిదేవతను
నీ ప్రాణములను నిలువున దీతును
కదలక మెదలక నిజము పల్కుమని
లంక యెదుర్కొనె కపి కిశోరుని.

అతి సుందరమీ లంకాపురమని
ముచ్చటపడి నే చూడవచ్చితిని
ఈ మాత్రమునకు కోపమెందుకులే
పురము గాంచి నే మరలిపోదులే.

అని నెమ్మదిగా పలుకగా విని
అనిలాత్మజుని చులకనగాగొని
లంకా రాక్షసి కపికిశోరుని
గర్జించి కసరి గద్దించి చరచెను.

సింహనాదమును మారుతి జేసె
కొండంతగ తన కాయము బెంచె
వామ హస్తమున పిడికిలి బిగించె
ఒకే పోటున లంకను గూల్చె.

కొండ బండలా రక్కసి దొల్లె
కనులప్పగించి నోటిని దెరచె
అబలను చంపుట ధర్మము గాదని
లంకను విడిచె మారుతి దయగొని.

ఓ బలభీమా ! వానరోత్తమా !
నేటికి నీచే ఓటమెరిగితి
ఈ నా ఓటమి లంకకు చేటని
పూర్వమే బ్రహ్మ వరమొసగెనని.

రావణుడాదిగ రాక్షసులందరు
సీతమూలమున అంతమొందెదరు
ఇది నిజమౌనని మీదే జయమని
లంకారాక్షసి పంపె హరేశుని.

శ్రీ హనుమాను గురుదేవులు నా యెద
పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.

కోటగోడ అవలీలగ ప్రాకెను
కపికిశోరుడు లోనికి దుమికెను
శత్రుపతనముగ వామపాదమును
ముందుగ మోపెను ముందుకు సాగెను.

ఆణిముత్యముల తోరణాలు గల
రమ్యతరమైన రాజవీధుల
వెన్నెలలో లంకాపురి శోభను
శోధనగా హరేశుడు గాంచెను.

సువర్ణమయ సౌధరాజముల
ధగధగ మెరసే ఉన్నత గృహముల
కళకళలాడే నవ్వుల జల్లులు
మంగళకరమౌ నృత్యగీతములు.

అప్సరసల మరపించు మదవతుల
త్రిస్థాయి బలుకు గానమాధురులు
వెన్నెలలో లంకాపురి శోభను
శోధనగా హరేశుడు గాంచెను.

సుందరమైన హేమ మందిరము
రత్నఖచితమౌ సింహద్వారము
పతాకాంకిత ధ్వజాకీర్ణము
నవరత్నకాంతి సంకీర్ణము.

నృత్య మృదంగ గంభీర నాదితము
వీణాగాన వినోద సంకులము
లంకేశ్వరుని దివ్యభవనమది
శోధనగా హరేశుడు గాంచెను.

అత్తరు పన్నీట జలకములు
కాలాగరు సుగంధ ధూపములు
స్వర్ణ ఛత్రములు వింజామరలు
కస్తూరి పునుకు జవాది గంధములు.

నిత్య పూజలు శివార్చనలు
మాస పర్వముల హోమములు
లంకేశ్వరుని దివ్యభవనమది
శోధనగా హరేశుడు గాంచెను. ॥ శ్రీ హనుమాను ॥

యమకుబేర వరుణ దేవేంద్రాదుల
సర్వసంపదల మించినది
విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది
బ్రహ్మవరమున కుబేరుడందినది.

రావణుండు కుబేరుని రణమందు
ఓడించి లంకకు గొని తెచ్చినది
పుష్పకమను మహా విమానమది
మారుతి గాంచెను అచ్చెరువొందె.

నేలను తాకక నిలచియుండునది
రావణ భవన మధ్యంబుననున్నది
వాయుపథమున ప్రతిష్ఠితమైనది
మనమున దలచిన ప్రీతిపోగలది.

దివినుండి భువికి దిగిన స్వర్గమది
సూర్యచంద్రులను ధిక్కరించునది
పుష్పకమను మహా విమానమది
మారుతి గాంచెను అచ్చెరువొందె.

లంకాధీశుని ప్రేమ మందిరము
రత్నఖచితమౌ హేమ మందిరము
చందనాది సుగంధ బంధురము
పానభక్ష్య పదార్థ సమృద్ధము.

ఆయా పరిమళ రూపానిలము
అనిలాత్మజుచే ఆఘ్రాణితము
పుష్పకమందు రావణమందిరమ్మది
మారుతి గాంచెను అచ్చెరువొందె.

మత్తున శయనించు సుదతుల మోములు
పద్మములనుకొని మూగు భ్రమరములు
నిమీలిత విశాల నేత్రములు
నిశాముకుళిత పద్మపత్రములు.

ఉత్తమ కాంతల గూడి రావణుడు
తారాపతి వలె తేజరిల్లెడు
పుష్పకమందు రావణమందిరమ్మది
మారుతి గాంచెను అచ్చెరువొందె.

రావణుండు రణమందున గెలిచి
స్త్రీలెందరినో లంకకు జేర్చెను
పితృ దైత్య గంధర్వ కన్యలు
ఎందెందరో రాజర్షి కన్యలు.

సీత తక్క వారందరు కన్యలె
రావణుమెచ్చి వరించిన వారలె
పుష్పకమందు రావణమందిరమ్మది
మారుతి గాంచెను అచ్చెరువొందె. ॥ శ్రీ హనుమాను ॥

Lord Hanuman Sundarakanda


Read: MS Rama Rao Sundarakanda Part 3

0 Comments: